ఆ గాయం వల్ల యాక్షన్ సీన్స్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది: పృథ్వీరాజ్ సుకుమారన్

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-12 15:19:37  IST  )

సాధారణంగా సినిమాల్లో డూప్ లేకుండా సొంతంగా యాక్షన్ సీన్స్ చేయడానికి పేరుగాంచిన పృథ్వీరాజ్, ఇప్పుడు మాత్రం హై-రిస్క్ స్టంట్స్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు చెప్పారు.

ఆ గాయం వల్ల యాక్షన్ సీన్స్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది: పృథ్వీరాజ్ సుకుమారన్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల నటించి ‘ఐ, నోబడీ’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ తన జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటనను గుర్తు చేసుకుని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 2023లో జరిగిన ఒక సినిమా షూటింగ్‌లో తనకు తీవ్ర గాయమైందని, ప్రస్తుతం తన ఎడమ కాలిలో మూడు టైటానియం స్క్రూలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. మనం చేసే ఒక చిన్న పొరపాటు లేదా ప్రమాదం కేవలం మనల్ని మాత్రమే కాదు, ఒక సినిమా నిర్మాణాన్ని నమ్ముకున్న వందలాది కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తుందో ఆ సంఘటన తనకు నేర్పిందని ఆయన అన్నారు.

సాధారణంగా సినిమాల్లో డూప్ లేకుండా సొంతంగా యాక్షన్ సీన్స్ చేయడానికి పేరుగాంచిన పృథ్వీరాజ్, ఇప్పుడు మాత్రం హై-రిస్క్ స్టంట్స్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు చెప్పారు. అలాగే ‘ఐ, నోబడీ’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన మరొక ప్రమాదాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. షూటింగ్ చేస్తుండగా ఒక ఫైటర్ తలకు తీవ్ర గాయమైందని, మెడ వెనుక భాగంలో ఏకంగా 37 కుట్లు పడ్డాయని చెప్పారు. ఒకవేళ ఆ షాట్ తాను చేసి ఉంటే, మరో ఆరు నెలల పాటు ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చేదని, యాక్షన్ సినిమాల్లో ఎంత రిస్క్ ఉంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణని అన్నారు. అయినప్పటికీ తనకు యాక్షన్ సీన్స్ చేయడం ఇష్టమని.. కానీ తన గాయాల వల్ల దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.

Next Story