- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఆ బాలీవుడ్ తార?
జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నాడు. ఇప్పటికే దేవర సినిమాతో సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఇటీవల వార్ 2 సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక ఇప్పుడు ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దాదాపు రూ. 360 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రానుందట. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
కొత్త షెడ్యూల్ మరో వారంలో ప్రారంభం కానుందట. ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ కాజోల్ స్పెషల్ రోల్ చేయబోతున్నారట. ఈ మేరకు ప్రశాంత్ నీల్ తాజాగా ఆమెతో చర్చలు కూడా చేశారట. అయితే ఆమెది నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమా కోసం సన్నగా కరెంటు తీగలా జూనియర్ ఎన్టీఆర్ తయారయ్యాడు. అటు ఈ మూవీని 2026 సమ్మర్ తర్వాత రిలీజ్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి.






