Samantha: ఈ అద్భుత‌మైన స్పంద‌న‌కు ధ‌న్యవాదాలు.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

టాలీవుడ్‌(Tollywood)లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత (Samantha).. ప్రజెంట్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

Samantha: ఈ అద్భుత‌మైన స్పంద‌న‌కు ధ‌న్యవాదాలు.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌(Tollywood)లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత (Samantha).. ప్రజెంట్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ (Shubham). ఈ మూవీ మే9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై ప్రీమియ‌ర్స్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న సొంతం చేసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ విజ‌య‌వాడ‌లో కొన్ని థియేట‌ర్స్‌ను సంద‌ర్శించింది. హ‌ర్షిత్ రెడ్డి, గ‌విరెడ్డి శ్రీనివాస్‌, చ‌ర‌ణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావ‌ణి ల‌క్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధ‌ర్ గౌడ్‌, డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల త‌దిత‌రులు ఇన్‌స్టా లైవ్ ద్వారా ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించారు. అలాగే సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్షకుల‌కు చిత్ర యూనిట్ ప్రత్యేక ధ‌న్యవాదాల‌ను తెలియ‌జేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇందులో న‌టీన‌టుల చ‌క్కటి న‌ట‌న‌తో పాటు ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం బాగుందని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఇన్‌స్టా లైవ్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు ప్రేక్షకులు సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అని ప్రశ్నించగా.. సమంత స్పందిస్తూ.. ‘భ‌విష్యత్తులో శుభం2 (Shubham-2) సినిమా ఉంటుంది’ అని తెలియ‌జేశారు. అలాగే.. ఈ సినిమాలో త‌ను చేసిన గెస్ట్ అప్పియ‌రెన్స్‌లో న‌టించ‌టంపై స‌మంత మాట్లాడుతూ.. ‘నేను క్యామియో చేయాల‌ని ముందుగా అనుకోలేదు. షూటింగ్ ముందు రోజు కూడా చేయ‌న‌నిచెప్పాను. అయితే ఇప్పుడు ఆ స‌న్నివేశంలో న‌టించ‌టంపై చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.

Next Story