- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా-157 ప్రయాణంలో నయనతార చేరుతున్నట్లు అనౌన్స్ చేసినప్పుడు మీరు చూపిన ప్రేమకు థ్యాంక్స్.. అనిల్ రావిపూడి పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘మెగా-157’ వర్కింట్ టైటిల్‌తో రాబోతున్న ఈ యాక్షన్ కామెడీ మూవీని షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అర్యన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి(Sahu Garapati), చిరు పెద్ద కూతురు సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక
ఇందులో మెగాస్టార్ శంకర వరప్రసాద్ పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ క్లారిటీ ఇస్తూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను కూడా షేర్ చేసి సినీ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అయితే ఈ వీడియోలో నయన్ చెప్పే సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అనే డైలాగ్ మరింత వైరల్ అయింది. దీంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు నయన్ ఫ్యాన్స్ వీడియోను తెగ వైరల్ చేసేశారు.
అయితే ఆ వీడియోకు ఇంతటి ఆదరణ దక్కడంతో అనిల్ రావిపూడి సంతోషంగా ఫీల్ అయి ట్విట్టర్ ఓ పోస్ట్ పెట్టాడు. ‘#MEGA157 ప్రయాణంలో నయనతార గారు చేరుతున్నట్లు ప్రకటించినందుకు మీరు చూపిన ప్రేమ మరియు ఉత్సాహం నిజంగా అఖండమైనది.. అభిమానులు మరియు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.. చిరు అనిల్ సంక్రాంతి 2026 – రఫ్ఫాడించెద్దాం’ అని రాసుకొస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త సామాజిక మాధ్యమాల్లో హైలెట్ అయింది.






