- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thandel Movie Trailer: ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే పాకిస్థాన్ ఉండదు.. తండేల్ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ (Thandel).

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ (Thandel). చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించాడు. ఈ చిత్రం లవర్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్‌తో పాటు.. సాంగ్స్‌కు కూడా ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా ట్రైలర్‌ను వైజాగ్‌లోని రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేసింది.
ట్రైలర్ విషయానికి వస్తే.. స్టార్టింగ్ స్టార్టింగ్‌లో లవ్ స్టోరీతో నాగచైతన్య, సాయిపల్లవి స్క్రీన్‌పై అదరగొట్టేశారు. అంతే కాకుండా వాళ్ల ఇద్దరి మధ్య సాగిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టేశాడు డైరెక్టర్ చందూ మొండేటి. ‘రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా’ అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ స్టార్ట్ కాగా.. ‘వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. ఇక తరచూ చేపల వేటకు వెళ్లే చైతూ.. ఓసారి పాకిస్థాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపు వెళ్తుంది. ‘మా దేశంలోని ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్థాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే’ అనే నాగచైతన్య చెప్పే డైలాగ్స్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ప్రజెంట్ ఈ ట్రైలర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.






