Thaman: పెళ్లి, విడాకులపై తమన్ షాకింగ్ కామెంట్స్.. సినీ సెలబ్రిటీలను ఉద్దేశించేనా? (వీడియో)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్( Thaman) అందరికీ సుపరిచితమే.

Thaman: పెళ్లి, విడాకులపై తమన్ షాకింగ్ కామెంట్స్.. సినీ సెలబ్రిటీలను ఉద్దేశించేనా? (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్( Thaman) అందరికీ సుపరిచితమే. ఆయన మహేష్ బాబు(Mahesh Babu), రామ్ చరణ్(Ram Charan), బాలకృష్ణ, చిరంజీవి(Chiranjeevi), నాగార్జున(Nagarjuna) వంటి స్టార్స్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహిరంచి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇక ఇటీవల బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’(Daaku Maharaj)కు తమన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లను రాబట్టి పలు రికార్డులు బ్రేక్ చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ పెళ్లి, డైవర్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘యువత ఆలోచన మారిపోయింది. ముఖ్యంగా యూత్‌పై సోషల్ మీడియా, ఇన్‌స్టా ప్రభావం విపరీతంగా ఉంది. ఎవరికి వారు ప్రైవసీ కోసం మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. పెళ్లిపై యువత ఆలోచనల్లో మార్పులు వచ్చాయి కానీ సరైన ఒపినియన్, సీరియస్ నెస్ లేదు. కాబట్టి నేను పెళ్లి చేసుకోవద్దనే చెప్తాను.

ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లి అయిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ.. కొన్ని నెలలకే భాగస్వామితో విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు పోవాలనే ఆలోచన లేదు. మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. వైవాహిక జీవితం అంటే ఇద్దరు కలిసి ఓకే నావపై వెళ్లడం.. కానీ కొందరు ఎవరికి వారు ఎడమొఖం, పెడమొఖం ఉంటున్నారు. కాబట్టి విడాకులు పెరిగిపోయాయి’’ అని చెప్పుకొచ్చారు. ఇక తమన్ యువతతో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసినట్లు అంతా చర్చించుకుంటున్నారు.

Next Story