Hungry Cheetah: తమన్ లైవ్ పెర్ఫామెన్స్.. దద్దరిల్లిన ఉప్పల్ మైదానం (వీడియో)

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం(Uppal Stadium)లో సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ లక్నో జట్ల మధ్య మ్యాచ్‌ జరుగబోతోంది.

Hungry Cheetah: తమన్ లైవ్ పెర్ఫామెన్స్.. దద్దరిల్లిన ఉప్పల్ మైదానం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం(Uppal Stadium)లో సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ లక్నో జట్ల మధ్య మ్యాచ్‌ జరుగబోతోంది. గురువారం మధ్యాహ్నం నుంచే క్రికెట్ లవర్స్ భారీగా మైదానానికి చేరుకున్నారు. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఓజీ సినిమా(OG Movie)లోని ‘హంగ్రీ చీతా’(Hungry Cheetah) పాట పాడి మైదానాన్ని హోరెత్తించారు. ఆడియెన్స్ కూడా ‘నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా’ అంటూ తమన్‌(Thaman)కు కోరస్ ఇచ్చారు. దీంతో మైదానమంతా దద్దరిల్లింది. తమన్ లైవ్ పెర్ఫామెన్స్‌(Thaman's Live Performance) ప్రేక్షకుల్లో జోష్ నింపిందని విశ్లేషకులకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయబోతోంది.

SRH: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్‌జిత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్‌ షమీ.

LSG: ఐడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌, కెప్టెన్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, ఆయుష్‌ బదోని, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్‌, దిగ్వేష్‌ రాఠీ, ప్రిన్స్ యాదవ్.


Next Story