మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గొప్ప మనసు.. ఆ డబ్బు మొత్తం ఏం చేస్తున్నాడో తెలుసా

by Gantepaka Srikanth |

టాలీవుడ్(Tollywood) సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్(Music Director) తమన్(Thaman) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గొప్ప మనసు.. ఆ డబ్బు మొత్తం ఏం చేస్తున్నాడో తెలుసా
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్(Music Director) తమన్(Thaman) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చేతినిండా ప్రాజెక్టులతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే రామ్ చరణ్‌(Ram Charan) గేమ్ ఛేంజర్‌(Game Changer)తో, బాలకృష్ణ(Balakrishna) డాకు మహారాజ్‌(Daku Maharaj)తో సంక్రాంతి వేళ రెండు హిట్లు అందుకున్నారు. అయితే.. సినిమాలతో పాటు తమన్‌కు స్పోర్ట్స్ కూడా ఇష్టమే అనే విషయం కూడా అందరికీ తెలుసు. సినిమా లేని గ్యాప్‌లో క్రికెట్ ఆడటం, ఇండియన్ ఐడల్ వంటి టీవీ షోలల్లో పాల్గొంటుంటారు. తాజాగా.. తమన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తమన్ సినిమాల వల్ల వచ్చే డబ్బును మాత్రమే వ్యక్తిగత ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తాడట. సినీ సెలబ్రెటీ క్రికెట్ లీగ్, ఇండియన్ ఐడల్ వంటి వాటి ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం ఛారిటీలకు కేటాయిస్తాడట. ఇందుకు సంబంధించిన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది గమనించిన తమన్ ఫ్యాన్స్.. ‘నువ్వు గ్రేట్’ అన్నా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, తెలుగులో తమన్ అగ్ర హీరోలు అందరితో కలిసి పనిచేశారు. పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్, మహేశ్ బాబుతో గుంటూరు కారం, అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురం, రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్, ఎన్టీఆర్‌తో బృందావనం వంటి సినిమాలకు సంగీతం అందించిన సత్తా చూపించారు.


Next Story