థమన్‌తో ప్రేమలో రాజాసాబ్ హీరోయిన్.. ఫొటోలు షేర్ చేసిన జంట..

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-01 17:09:21  IST  )

బ్యూటిపుల్ నిధి అగర్వాల్ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇంతకు ముందు ‘హరి హర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఆమె.. ప్రస్తుతం ప్రభాస్‌కు జోడీగా నటించిన ‘ది రాజాసాబ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

థమన్‌తో ప్రేమలో రాజాసాబ్ హీరోయిన్.. ఫొటోలు షేర్ చేసిన జంట..
X

దిశ, సినిమా : బ్యూటిపుల్ నిధి అగర్వాల్ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇంతకు ముందు ‘హరి హర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఆమె.. ప్రస్తుతం ప్రభాస్‌కు జోడీగా నటించిన ‘ది రాజాసాబ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. అయితే నిధి, థమన్ మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం థమన్ పెట్టిన న్యూ ఇయర్ విషింగ్ పోస్టే. నిధితో కలిసి క్లోజ్‌గా కూర్చున్న ఫొటో షేర్ చేసిన ఆయన.. ‘న్యూ ఇయర్ ఫ్రమ్ అజ్’ అనే క్యాప్షన్ ఇచ్చి.. లవ్ సింబల్ కూడా జోడించాడు. దీంతో సోషల్ మీడియాలో ఇదే టాపిక్ నడుస్తోంది. అయితే నిధి ఈ పోస్ట్‌కు రిప్లయ్ ఇస్తూ కవర్ చేసే ప్రయత్నం చేసింది కానీ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. నిధి ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు. నిధి పాపతో ఈయన లవ్ ట్రాక్ ఏంట్రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు.

Next Story