- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thaman: ‘డాకు మహారాజ్’ ఓటీటీ అప్డేట్ ఇచ్చిన తమన్.. డాల్బీ సౌండ్ సిస్టమ్ అంటూ హైప్ పెంచుతున్న ట్వీట్
నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj).

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj). బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath)హీరోయిన్లుగా నటించారు. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోస్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఇందులో ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) బాలయ్యతో దబిడి దిబిడి ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ‘డాకు మహారాజ్’ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్‌లో విడుదలైంది.
ఈ చిత్రం మొదటి షో నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుని ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు రూ. 150 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టిన ‘డాకు మహారాజ్’ బాక్సాఫీసు వద్ద హిట్ బొమ్మగా నిలిచింది. అయితే బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేశారు. ఇందులోని ప్రతి సీన్‌కు బాలయ్య అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో ‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయంపై ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఫిబ్రవరి 9 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే ఎక్స్ ద్వారా ఒక అభిమాని.. డాకు మహారాజ్ సినిమా లైఫ్ టైమ్ ఫేవరేట్ మూవీగా నిలిచి పోతుంది. బాలకృష్ణను ఎలా చూడాలని అనుకున్నామో అలా ఈ సినిమాలో చూశాం. సంగీతం, దర్శకత్వం, కెమెరా అన్ని విధాలుగా అద్భుతంగా ఉందని ట్వీట్ చేశాడు.
ఇక ఆ ట్వీట్‌కి తమన్ (Thaman)స్పందించారు. ‘‘త్వరలోనే డాకు మహారాజ్‌ను ఓటీటీలో చూడబోతున్నాం. సినిమాను చూడటాన్ని ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందుతారు. డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది అత్యంత జరుపుకునే సినిమా అవుతుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే బాక్సులను షేర్ చేశారు. అయితే ఈ మూవీ ఓటీటీలోనూ థియేటర్స్‌లో చూసిన విధంగా సౌండ్స్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ ట్వీట్ డాకు మహారాజ్‌పై అంచనాలను పెంచుతున్నాయి.
It will be the Most Celebrated Film on @NetflixIndia once it’s out
— thaman S (@MusicThaman) January 28, 2025
We are giving this output in @Dolby
Will be a super satisfied film to watch it #DaakuOnNetflix 🔥🔥🔥🔥🔥🔥🔥#BlockBusterDaakuMaharaaj 🥁🥁🥁🥁🥁@vamsi84 @dirbobby https://t.co/3pYIcK8pJ7






