- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"అఖండ-5" కు కూడా బాలయ్య రెడీ
అఖండ సినిమాను ఐదు భాగాలుగా కూడా తీయవచ్చు అని స్పష్టం చేశారు. దానికి నందమూరి బాలయ్య కూడా రెడీగా ఉంటారన్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలయ్య- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా అఖండ 2 ( Akhanda 2 - Thaandavam). ఇప్పటికే అఖండ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి బంపర్ హిట్ అందుకుంది. అయితే ఇప్పుడు పార్ట్ 2 లో భాగంగా అఖండ 2 తాండవం తీస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు లాంటి నటులు ఇందులో ఉన్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అంచనాలను భారీగా పెంచాయి.
డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో, తాజాగా ఈ మూవీ నుంచి తాండవం లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ మాట్లాడారు. అఖండ 2 సినిమా రూ.250 కోట్లకు పైగా కలెక్ట్ చేయబోతుందని అంచనా వేశారు. బాలయ్య సినిమాలు తనకు కేస్ స్టడీతో సమానమని వెల్లడించారు. అఖండ సినిమాను ఐదు భాగాలుగా కూడా తీయవచ్చు అని స్పష్టం చేశారు. దానికి నందమూరి బాలయ్య కూడా రెడీగా ఉంటారన్నారు.






