- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అఖండ 2’ సక్సెస్ క్రెడిట్ గురించి మాట్లాడిన థమన్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ 'అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట

కంగ్రాట్స్ తమన్ గారు నెలకో హిట్ కొడుతున్నారు.. 2025 ని చాలా గ్రాండ్ గా ముగిస్తున్నారు?
-థాంక్యూ అండి. సినిమా బాగుంటే అన్ని బాగుంటాయి. మ్యూజిక్ అనేది ఒక క్రాఫ్ట్. మన క్రాఫ్ట్ ని మనం బెస్ట్ గా చేయాలి. డాకు మహారాజ్, గేమ్ చేంజెర్, ఓజి.. అఖండ2.. రాబోతున్న రాజాసాబ్ ఇవన్నీ కూడా వరుసగా కలిసి వచ్చాయి.
అఖండ2 కి ఇంత పెద్ద విజయాన్ని మీరు ఊహించారా?
-మనం స్క్రిప్ట్ అనుకున్నప్పుడే కొన్ని హై మూమెంట్స్ అనుకుంటాం. బోయపాటి గారు ఆషామాసి డైరెక్టర్ కాదు. కమర్షియల్ సినిమా నమ్మించేలా తీయడం నిలబెట్టడం చాలా గొప్ప విషయం. అందులోనూ సనాతన ధర్మం కంటెంట్ గా తీసుకుని దాన్ని కమర్షియల్ గా చెప్పడం, అందులోనూ బాలయ్య గారి లాంటి సూపర్ మాస్ ఎనర్జిటిక్ స్టార్ తో చేయడం మామూలు విషయం కాదు.
-అఖండపాత్ర అందరికీ సర్ప్రైజ్. నిజానికి అఖండలో అంత ఉంటుందని ఎవరూ అనుకోలేదు. సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి మరింత -భారీ అంచనాలతో ప్రేక్షకులు వచ్చారు. సనాతన ధర్మాన్ని అద్భుతంగా చెప్పి కమర్షియల్ విజయాన్ని సాధించడం.. బాలయ్య గారికి, బోయపాటి గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది.
మ్యూజికల్ గా మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది ఏమిటి?
-నిజానికి అండ నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. బోయపాటి గారికి నాకు రెండు నెలలు సమయం కావాలని అడిగాను ఒక్క రీల్ చేసి చూపించాను. ఆయనకు చాలా నచ్చింది. అప్పుడు నాకున్న బడ్జెట్ ని మార్చి, నాకు మరింత సమయాన్ని ఇచ్చి ఎంతగానో సపోర్ట్ చేయించి చేసి మ్యూజిక్ చేయించారు. అఖండకి అయిన నాకు వెన్నుముకలాగా నిలిచారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలనే తాపత్రయంతో వర్క్ చేశాను. అఖండ మ్యూజిక్ అందరూ సర్ప్రైజింగ్ గా విన్నారు.
-ఇప్పుడు అఖండ2 లో ఇంకా ఎంత కొత్తగా చేయొచ్చు అని ఆలోచించా. అందులోనూ తాండవం అని పేరు పెట్టారు. ఆడియన్స్ ని ఎలా ట్రాన్స్ లోకి తీసుకువెళ్లాలి అని ఆలోచన చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి 73 రోజులు పట్టింది. అందులో ఒక 20 రోజులు శివుని మంత్రాలు ఎంత కొత్తగా చేయాలి అనే దానికి ఒక 20 రోజులు ఎక్సర్సైజ్ చేశాం. తర్వాత 40 రోజులు ఇన్స్ట్రుమెంట్, రికార్డింగ్ వర్క్ చేసాం.






