TVK Vijay: చిన్నారితో డ్యాన్స్‌..అదిరిపోయే స్టెప్పులేసిన హీరో

by velandi.Saikiran |

తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఇప్పుడే మొదలైంది. ఇందులో భాగంగానే హీరో విజయ్ ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ... ప్రజలకు దగ్గరవుతున్నారు.

TVK Vijay: చిన్నారితో డ్యాన్స్‌..అదిరిపోయే స్టెప్పులేసిన హీరో
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే టీవీకే పార్టీని ఏర్పాటు చేసుకున్న విజయ్, ఎలాగైనా తమిళనాడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా స్ట్రాటజీగా ముందుకు వెళ్తున్నారు. తమిళనాడు రాష్ట్రం మొత్తం సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ అదరగొడుతున్నారు. ఆయన ఊపు చూస్తుంటే సీఎం కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డాన్స్ ఇరగదీసిన హీరో విజయ్

తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఇప్పుడే మొదలైంది. ఇందులో భాగంగానే హీరో విజయ్ ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ... ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్, స్టేజ్ పైన స్టెప్పులు వేశారు. ఓ చిన్నారితో కలిసి డ్యాన్స్ ఇరగదీసారు విజయ్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కాగా త‌మిళ‌నాడులో ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ నెల‌లో త‌మిళ‌నాడు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానుంద‌ట‌.

Next Story