- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జననాయగన్ రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్.. కష్టాలు, సవాళ్లను అధిగమించి ఫైనల్‌గా వచ్చేస్తున్నాం అంటూ పోస్ట్
తమిళ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ చిత్రం విడుదలకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. ఆయన తన రాజకీయ రంగ ప్రవేశానికి ముందు నటించిన ఈ చిత్రం రిలీజ్‌కు సెన్సార్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో షూటింగ్ పూర్తైనప్పటికీ రిలీజ్‌కు మాత్రం నోచుకోలేదు. అంతే కాకుండా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ అత్యధిక మెజారిటీతో తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఎట్టకేలకు జననాయగన్ సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఖాయం అయిందంటూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘కష్టాలు, సవాళ్లను అధిగమించి, చివరకు వచ్చేశాం.. జననాయగన్ జూన్ 19, 2026 గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అయింది.. నాయకుడు వచ్చేశాడు’ అంటూ తెలిపారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.






