Thalapathy Vijay: దళపతి విజయ్‌కి ఊహించని షాక్.. అలా చేశారని పోలీసులకు ఫిర్యాదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-13 05:26:24  IST  )

తమిళ వెట్రి కళగం పార్టీ (Tamil Vetri Kalagam Party) అధ్యక్షుడు, తమిళ సూపర్ స్టార్ విజయ్‌ (Vijay) వివాదంలో చిక్కుకున్నారు.

Thalapathy Vijay: దళపతి విజయ్‌కి ఊహించని షాక్.. అలా చేశారని పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ వెట్రి కళగం పార్టీ (Tamil Vetri Kalagam Party) అధ్యక్షుడు, తమిళ సూపర్ స్టార్ విజయ్‌ (Vijay) వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా, ఆయనపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌ (Chennai Police Commissioner) ఆఫీస్‌లో ముస్లింల మనోభావాలను దెబ్బతీశారంటూ ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళితే.. యాక్టర్ విజయ్ ఇటీవలే చెన్నైలోని రాయపేట (Rayapet) వైఎంసీఏ గ్రౌండ్‌ (YMCA Ground)లో ముస్లిం సోదరలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. అయితే, ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందని సున్నత్ జమాత్ ట్రెజరర్ సయ్యద్ కౌస్ (Syed Kaus).. విజయ్ ఇఫ్తార్ విందు పేరుతో ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. విందు ఇవ్వడం తప్పు కాదని.. పద్ధతులు, ఆచారాలు పాటించడంలో ఆయన పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు.

ఇఫ్తార్ విందుకు తాగుబోతులు, రౌడీలు కూడా రావడం తమ సమాజాన్ని అవమానపరచడమేనని సయ్యద్ కౌస్ ధ్వజమెత్తారు. విజయ్‌ సెక్యూరిటీ సిబ్బంది విందుకు వచ్చిన వారిని చాలా చీప్‌గా చూశారని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నటుడు విజయ్‌ (Vijay)పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ, తనపై వచ్చిన ఆరోపణలపై విజయ్ ఇప్పటికు రిప్లై ఇవ్వకపోవడం అటు అభిమానుల్లో.. ఇటు పార్టీ నేతల్లోను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇఫ్తార్ విందులో తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్‌ తెల్లని లాల్చి ధరించి.. తలపై టోపీ పెట్టుకుని ముస్లిం సోదరులతో నమాజ్‌ చేశారు. అయితే, అందుకు సంబంధించి ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read More..

రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ అలా ఉంటుంది.. హైప్ పెంచేస్తున్న యాక్టర్ సప్తగిరి కామెంట్స్

Next Story