సినిమాలకు దళపతి విజయ్ గుడ్‌ బై.. అధికారిక ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-28 07:31:02  IST  )

సినిమాలకు దళపతి విజయ్ గుడ్‌ బై.. అధికారిక ప్రకటన

సినిమాలకు దళపతి విజయ్ గుడ్‌ బై.. అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టీవీకే పార్టీ అధినేత, దళపతి విజయ్(Thalapathy Vijay) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న జన నాయగన్ సినిమానే తన ఆఖరి మూవీ అని ప్రకటించారు. ఇంతకాలం తనకు ఇండస్ట్రీలో సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనను ఇంతలా అభిమానించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. ఇక పూర్తి సమయం రాజకీయాలకు కేటాయిస్తానని అన్నారు. మరో 30 ఏళ్లు నిలబడుతా.. అభిమానులకు సేవ చేస్తా అని తెలిపారు. ప్రజల్లో ఉండటానికి సినిమాలకు స్వస్తి చెబుతున్నానని విజయ్ స్పష్టం చేశారు. కాగా, ఇటీవల ‘జననాయగన్‌’ సినిమా ఆడియో విడుదల వేడుక మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్‌కి ఇదే చివరి చిత్రం కావడంతో అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందించారు. కాగా, ఇప్పటికే రాజకీయాల్లో యాక్టీవ్ అయిన విజయ్.. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. దళపతి పూర్తి స్థాయి ఎంట్రీతో తమిళ రాజకీయం వేడెక్కనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story