- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాలో తన సన్నివేశాలు పూర్తి చేసుకున్న స్టార్ హీరో.. మళ్లీ రాజకీయాలపై ఫోకస్!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జననాయగన్’ (Jananayagan).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జననాయగన్’ (Jananayagan). విజయ్ సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి హెచ్ వినోద్ (H. Vinod) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మమిత బైజు (Mamita Baiju), బాబీ డియోల్ (Bobby Deol) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై విజయ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌లో కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.
అంతే కాకుండా.. దళపతి విజయ్ రాజకీయ ఎంట్రీ తర్వాత తీస్తున్న మూవీ కావడంతో ఇందులో రాజకీయాలకు సంబంధించిన సీన్స్ హై లెవల్‌లో ఉండనున్నాయని టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘జననాయగన్’ మూవీలో విజయ్‌కు సంబంధించిన సన్నివేశాలు పూర్తయినట్లు తెలుస్తుండగా.. ఇక నుంచి ఆయన పూర్తి సమయం రాజకీయాల కోసం కేటాయించనున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్ దళపతి పూర్తిగా సినిమాలకు దూరం అయినట్లు కన్ఫర్మ్ చేసుకున్న ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
The scenes involving #ThalapathyVijay in the film #JanaNayagan have been completed.
— Movie Tamil (@MovieTamil4) May 29, 2025
Thalapathy Vijay is now going to enter politics full-time pic.twitter.com/O4cZV9DiZP






