- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజినీకాంత్ - కమల్ సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరో తెలుసా??
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్.. #తలైవర్173 మాగ్నమ్ ఓపస్‌కు దర్శకుడిని అనౌన్స్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చే ఈ చిత్రానికి దర్శకుడెవరో చెప్పేసింది.

దిశ, సినిమా : రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్.. #తలైవర్173 మాగ్నమ్ ఓపస్‌కు దర్శకుడిని అనౌన్స్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చే ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపింది. మూవీ నెక్స్ట్ లెవల్ సినిమాటిక్ గ్రాండియర్‌గా ఉండబోతుందని ప్రకటించింది. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మాణంలో #తలైవర్173 రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లెగసీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోనుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం మాస్ అప్పీల్, ఎమోషన్, హై క్యాలిటీ మేకింగ్‌తో ప్రేక్షకులని అలరించబోతుంది. చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుండగా... తారాగణం, టెక్నికల్ టీం గురించి మరిన్ని వివరాలను రివీల్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజినీ అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా #తలైవర్173.. 2027 పొంగల్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.






