TFI: సైజులు కొంచెం పెంచమ్మా..! హీరోయిన్ పై డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

by Ramesh Goud |   (  Updated:2025-01-12 14:26:32  IST  )

మన్మథుడు మూవీ హీరోయిన్ అన్షుపై డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Director Thrinadha Rao Nakkina) సెన్సేషనల్ కామెంట్స్(Sensational Comments) చేశారు.

TFI: సైజులు కొంచెం పెంచమ్మా..! హీరోయిన్ పై డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: మన్మథుడు మూవీ హీరోయిన్ అన్షుపై డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Director Thrinadha Rao Nakkina) సెన్సేషనల్ కామెంట్స్(Sensational Comments) చేశారు. ఈ వ్యాఖ్యలపై సినిమా ప్రియులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సందీప్ కిషన్(Sandeep Kishan) హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మజాకా(Magaka) అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్(Teaser launch Event) ఇవాళ జరిగింది.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాథరావు మాట్లాడుతూ.. "చాలా ఏళ్ల తర్వాత హీరోయిన్ అన్షు మళ్లీ నటిస్తున్నారని, ఆమె కొంచెం సన్నబడ్డారని చెప్పారు. అలాగే అందుకే సినిమా కోసం తిని కొంచెం పెంచమ్మా.. తెలుగుకి సరిపోదు, అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. డైరెక్టర్ త్రినాథ రావుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ ప్రముఖ హీరోయిన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను బ్యాన్ చేయాలి అని కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక ఈ డైరెక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి అని మా అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) ని ట్యాగ్ చేస్తున్నారు.

Next Story