- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్‌లో కలకలం..కపిల్ శర్మ కేఫ్‌పై ఉగ్రవాది కాల్పులు
కెనడాలో కాల్పల కలకలం చోటు చేసుకుంది. బాలీవుడ్ కమెడియన్, ఇండియాలోనే అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ కేఫ్ పై దుండగులు కాల్పులు జరిపారు.

దిశ, వెబ్ డెస్క్: కెనడాలో కాల్పల కలకలం చోటు చేసుకుంది. బాలీవుడ్ కమెడియన్, ఇండియాలోనే అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ కేఫ్ పై దుండగులు కాల్పులు జరిపారు. కపిల్ శర్మ ఇటీవలే కెనడాలో కేఫ్ ప్రారంభించారు. కపిల్ శర్మ విదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం ఇదే మొదటిసారి. నూతనంగా నిర్మించిన కేఫ్ పై దుండగులు కాల్పులు జరిపారు. కాగా కాల్పులు తామే జరిపినట్టు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్జి ప్రకటించాడు.
హర్జీత్ సింగ్ లడ్జి BKI (బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్) అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నాడు. గతంలో కపిల్ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో లడ్డి ఈ దాడికి పాల్పడినట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కపిల్ శర్మ కేఫ్ పై కాల్పులు జరగటంతో బాలీవుడ్ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేఫ్ పై కాల్పులు జరపడంతో కపిల్ శర్మకు కూడా థ్రెడ్ ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు సెక్యురినీ పెంచాలని అభిమానులు కోరుతున్నారు. అంతే కాకుండా నింధితులను త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.






