- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా ‘తెరచాప’ ట్రైలర్ లాంచ్
జోయల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తెరచాప' చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు

దిశ, సినిమా: అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తెరచాప'. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ విడుదల తేది దగ్గరవుతున్న సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. తెరచాప ట్రైలర్ చూస్తుంటే ఆహ్లాదకరమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మొదలై సముద్రతీరంలో ఉండే ఒక ఊరి కథలా అనిపిస్తుంది. ఊరంటే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలుతో పాటు రాజకీయాలు, భేద భావాలు ఉండడం కూడా సహజమే. అటువంటి పరిస్థితుల మధ్య ఒక యువకుడు తన ఊరిలో ఉన్న పరిస్థితుల పట్ల పోరాడుతున్నట్లు అర్థమవుతుంది. డైలాగ్స్ ఇంకా టేకింగ్ చాలా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బెంచ్ మార్క్ సృష్టించే విలేజ్ పొలిటికల్ డ్రామాలా అనిపిస్తుంది.






