సమంతకు టెన్షన్.. ‘జన నాయగన్’తో క్లాష్ తప్పదా?

by Pulgam srinivas |

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే తేదీన విజయ్ నటించిన ‘జన నాయగన్’ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సమంతకు టెన్షన్.. ‘జన నాయగన్’తో క్లాష్ తప్పదా?
X

దిశ, వెబ్ డెస్క్: సమంత స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించి చాలా కాలమే అయింది. తాజాగా ఆమె దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దీంతో చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరోయిన్‌ను వెండితెరపై చూడబోతున్నామంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఊహించని పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా కూడా జూన్ 19న విడుదలయ్యే అవకాశం ఉందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా రావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ‘జన నాయగన్’ సినిమాను తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా విజయ్ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో, హిట్ టాక్ వస్తే సమంత సినిమా కలెక్షన్లపై కూడా ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి సమంత 'జన నాయగన్'తో పోటి ఏర్పడితే 'మా ఇంటి బంగారం'ను రంగంలోకి దింపుతుందా? లేక వేరే విడుదల తేదీ గురించి ఆలోచిస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

Next Story