‘తెలుసు కదా’ మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన మూవీ టీమ్

by I. Sairam |

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’(Telusu Kada).

‘తెలుసు కదా’ మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన మూవీ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’(Telusu Kada). నీరజ కోన(Neeraja Kona) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Viswaprasad), టీజీ కృతి ప్రసాద్(Krithi Prasad) నిర్మిస్తున్నారు. ఇందులో రాశి ఖన్నా(Rashi Khanna), శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుండగా.. వైవా హర్ష(Viva Harsha) కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ దీపావళి(Diwali) పండుగ సందర్భంగా అక్టోబర్ 17న తెలుగు, తమిళం, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.

అయితే రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మల్లికగంధ’ రాబోతుంది అని అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మూవీ టీమ్ రెండు క్రేజీ ఫొటోస్‌ను షేర్ చేస్తూ ‘అతను నవ్వుతూ అన్నీ చెబుతాడు.. సీజన్ చార్ట్‌బస్టర్‌కి సిద్ధంగా ఉండండి.. ఎక్కువగా ఎదురుచూస్తున్న తెలుసుకదా మొదటి సింగిల్ #మల్లికగంధ రేపు విడుదల కాబోతుంది’ అని రాసుకొచ్చారు. ఇక ఫొటోస్‌లో సిద్ధు, తమన్, నీరజకొన టీ తాగుతూ ముచ్చట్లు వేసుకుంటున్నారు. అలాగే మరో క్యూట్ పిక్ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. Link

Next Story