Producer: ఆ సినిమాను పవన్ కల్యాణ్‌కు చూపించడానికి ట్రై చేస్తా

by Gantepaka Srikanth |

ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) కుమారుడు.. శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నది.

Producer: ఆ సినిమాను పవన్ కల్యాణ్‌కు చూపించడానికి ట్రై చేస్తా
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) కుమారుడు.. శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నది. తొలుత ఒక్క హిందీ భాషలోనే విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో తొలిరోజు నుంచే భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఏకంగా ఒక్క హిందీలోనే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కన్నడ, తమిళ, మలయాళం ఇండస్ట్రీలతో పాటు తెలుగులోనూ విడుదల చేయాలని ఫ్యాన్స్ నుంచి భారీ ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. దీంతో అభిమానుల కోరిక మేరకు తెలుగులో మార్చి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

తెలుగు రైట్స్‌ను గీతా ఆర్ట్స్(Geetha Arts) బ్యానర్‌పై నిర్మాతలు అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు(Bunny Vasu)లు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం నిర్మాత బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి దేశ భక్తితో నిండి ఉన్న ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(DCM Pawan Kalyan)కు చూపించే ప్రయత్నం చేస్తానని అన్నారు. తప్పకుండా ఈ చిత్రం ఆయనకు నచ్చుతుందనే నమ్మకం తనకుందని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ చిత్రంలో విక్కీ కౌశల్ హీరోగా నటించగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది.

Next Story