- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ కార్మికులకు గుడ్ న్యూస్.. నిర్మాతల మండలి కీలక నిర్ణయం
సినీ కార్మికుల(Film Workers) ఆందోళనపై నిర్మాతల మండలి(Telugu Producers Council) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: సినీ కార్మికుల(Film Workers) ఆందోళనపై నిర్మాతల మండలి(Telugu Producers Council) కీలక నిర్ణయం తీసుకుంది. మూడు విడతలుగా వేతనాలు పెంచాలని నిర్ణయించారు. తొలి విడతలో 15 శాతం, రెండో విడతలో 5 శాతం, మూడో విడతలో 5 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, 30 శాతం వేతనాలు పెంచాలని గతకొన్ని రోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై నిర్మాతలు నిర్ణయం తీసుకోవడంతో వారికి భారీ ఊరట లభించినట్లయింది. ఇదిలా ఉంటే.. కాసేపటి క్రితమే ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు, నేను వారిని కలిశానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కార్మికుల 30 శాతం వేతన పెంపు వంటి వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లు కొందరూ వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.






