- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ పెద్ద కొడుక్కి తెలుగు ప్రొడ్యూసర్ విషెస్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) పెద్ద కొడుకు అకీరా నందన్(Akira Nandan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) పెద్ద కొడుకు అకీరా నందన్(Akira Nandan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో రోజూ అకీరాను పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఓజీ సినిమాలో, హరిహర వీరమల్లు సినిమాలో స్పెషల్ కెమియో ఉంటుందంటూ పోస్టులు పెడుతూ తెగ వైరల్ చేస్తుంటారు. తాజాగా ఇవాళ అకీరా నందన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాను కుదిపేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు ఎడిట్ చేసి పోస్టు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అకీరాకు టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్(Bandla Ganesh) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు పెట్టారు. ‘జన్మదిన శుభాకాంక్షలు అకీరా బాబు. ఆ పరమశివుడి ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
మరోవైపు సింగపూర్(Singapore)లో చదువుకుంటున్న పవన్ కల్యాన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి. స్కూళ్లో మంటలు చెలరేగడంతో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్‌కు వెళ్లబోతున్నారు.






