Siddu Jonnalagadda: ఓటీటీలోకి వచ్చిన ఐదేళ్లకు థియేటర్స్‌లోకి వస్తున్న తెలుగు సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

by Mallepaka Hamsa |

సాధారణంగా ఏ సినిమా అయినా ముందు థియేటర్స్‌లో విడుదలై తర్వాత ఓటీటీలోకి వస్తాయి.

Siddu Jonnalagadda: ఓటీటీలోకి వచ్చిన ఐదేళ్లకు థియేటర్స్‌లోకి వస్తున్న తెలుగు సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: సాధారణంగా ఏ సినిమా అయినా ముందు థియేటర్స్‌లో విడుదలై తర్వాత ఓటీటీలోకి వస్తాయి. అయితే టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ఓ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించిన ఐదేళ్లకు థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను కూడా నెట్టింట పెట్టారు. అయితే ఈ మూవీ టైటిల్ కూడా మార్చినట్లు వెల్లడించారు. సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), రవికాంత్(Ravikanth) కాంబోలో వచ్చిన మూవీ ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’.

రానా దగ్గుబాటి(Rana Daggubati) సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్(Shradha Srinath), సీరత్ కుమార్(Seerat Kumar), షాలినీ హీరోయిన్లు నటించారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందించిన ఈ మూవీ 2020లో ఆహాలో స్ట్రీమింగ్ అయింది. కరోనా కారణంగా దీనిని డిజిటల్ స్ట్రీమింగ్ చేయడంతో పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రేమికుల రోజున ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో ఫిబ్రవరి 14న చిత్రం థియేటర్లలో విడుదల కానున్నట్లు రానా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కానీ టైటిల్ ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది మాత్రం అడగకండి అది కాంప్లికేటెడ్ అని రాసుకొచ్చారు. కాగా.. సిద్దు జొన్నల గత ఏడాది ‘టిల్లు స్వ్కార్’ చిత్రంతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా, జాక్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాలు త్వరలోనే థియేటర్స్‌లో విడుదల కాబోతున్నాయి.

Next Story