తమిళ ఇండస్ట్రీకి క్యూ కడుతున్న తెలుగమ్మాయిలు.. లిస్టు చాలా పెద్దది

by Pulgam srinivas |

తెలుగమ్మాయిలైన అంజలి, ఐశ్వర్య రాజేష్, శ్రీ దివ్య తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం శ్రీ లీల, శ్రీ గౌరీ ప్రియ, వైష్ణవి చైతన్య, శ్రీదేవి తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారు.

తమిళ ఇండస్ట్రీకి క్యూ కడుతున్న తెలుగమ్మాయిలు.. లిస్టు చాలా పెద్దది
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ ఇండస్ట్రీలో రాణిస్తున్న తెలుగమ్మాయిల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ వస్తుంది. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి అంజలి తెలుగమ్మాయే. ఈమె మొదటగా తమిళ సినిమాల ద్వారా గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్లో విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఈమెకు కోలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. ఈమెతో పాటు ఐశ్వర్య రాజేష్, బస్టాప్ బ్యూటీ శ్రీ దివ్య కూడా తెలుగమ్మాయిలే. వీరిద్దరూ తమిళ్లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

ప్రస్తుతం వీరి దారిలో శ్రీలీల వెళుతోంది. కొన్ని రోజుల క్రితమే పరాశక్తి సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించిన ఈ నటి తాజాగా ధనుష్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. శ్రీ గౌరీ ప్రియ కూడా ప్రస్తుతం తమిళ్లో వరుసపెట్టి అవకాశాలను అందుకుంటుంది. ఈమెకు ఒకటి, రెండు మంచి విజయాలు కోలీవుడ్లో దక్కినట్లయితే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. యూట్యూబ్ వీడియోల ద్వారా క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య కూడా తమిళ ఇండస్ట్రీపై ఫుల్ ఫోకస్ పెట్టింది.

తాజాగా ఈ బ్యూటీకి నటుడు, సంగీత దర్శకుడు అయిన జీవీ ప్రకాష్ కుమార్ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం దక్కింది. కోర్టు మూవీలో హీరోయిన్గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందిన శ్రీదేవి ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా తెలుగమ్మాయిలు వరుసపెట్టి తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతూ వెళుతున్నారు. అలాగే అక్కడ మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నారు.

Next Story