- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవకాశాలు ఇవ్వకుండా తెలుగు అమ్మాయిలను తొక్కేస్తున్నారు.. యంగ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఫస్ట్ మూవీనే మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ మెప్పిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. అలా గత ఏడాది ‘తంత్ర’(Tantra), ‘పొట్టేల్’(Pottel), ‘శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్’(Srikakulam Sherlock Holmes), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది.
అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య నాగళ్ల సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘టాలీవుడ్‌లో 100 శాతానికి 20శాతం మాత్రమే తెలుగు వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇతర ఇండస్ట్రీలకు వెళ్లాలన్నా అక్కడ మనకు 20శాతం మాత్రమే చాన్స్ ఉంటుంది. తెలుగు వారే అవకాశాలు ఇవ్వకుండా తెలుగు అమ్మాయిలను తొక్కేస్తున్నారు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






