- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పహల్గామ్ ఉగ్రదాడి ప్రదేశంలో తెలుగు సినిమా షూటింగ్
దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ టూరిస్ట్ రిసార్ట్‌లో ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 26 మందిని బలి తీసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిన తరవాత ఆరు నెలలకు సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ టూరిస్ట్ రిసార్ట్‌లో ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 26 మందిని బలి తీసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిన తరవాత ఆరు నెలలకు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఉగ్రదాడి తరవాత శ్రీనగర్ లో జరుగుతున్న మొదటి సినిమా షూటింగ్ ఇదే. ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ఇది తెలుగు సినిమా కావడం విశేషం. ఇదిలా ఉంటే పహల్గామ్ దాడి తరవాత కొన్ని రోజుల పాటు అక్కడ ఆంక్షలు విధించారు. తరవాత ఆంక్షలు ఎత్తివేసి భద్రత పెంచారు. మెల్లి మెల్లిగా పర్యాటకులు సైతం పహల్గామ్ లో పర్యటిస్తున్నారు. కశ్మీర్ లోనే పహల్గామ్ సుందరమైన ప్రదేశం అని పర్యాటకులు చెబుతుంటారు. దీంతో అక్కడ చాలా సినిమా షూటింగ్లు సైతం జరుగుతుంటాయి. దాడి తరవాత ఇంతకాలం బ్రేక్ పడగా మళ్లీ షూటింగ్ లు మొదలవ్వడంతో అక్కడ సందడి నెలకొంది. VIDEO






