- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. మన ప్యానెల్ VS ప్రోగ్రెసివ్ ప్యానెల్
నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఎన్నికలు జరగనున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఫిల్మ్ నగర్లో రాజకీయ వాతావరణం నెలకొంది. అగ్ర నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతల మధ్య పోటీ నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై ఫలితాలు వెల్లడి కానున్నాయి. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ జరుగుతుండగా.. సి కల్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ లు మన ప్యానెల్ ను బలపరుస్తున్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు ప్రోగ్రెసివ్ ప్యానెల్ ను బలపరుస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏ ప్యానెల్ గెలుస్తుందోనని ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు టాలీవుడ్ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి.
Read More..
Next Story






