- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రారంభమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4గంటలకు కౌంటింగ్ జరగనుంది. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ సొసైటీ కాంప్లెక్స్ వద్ద ఉదయం నుండి నిర్మాతలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నిర్మాతలు వచ్చి ఇప్పటికే ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ మద్దతు ఇస్తున్నారు. కాగా మన ప్యానెల్ కు చదలవాడ శ్రీనివాస్, సి. కళ్యాణ్, ప్రసన్నకుమార్ మద్దతు ఇస్తున్నారు.
పెద్ద నిర్మాతలు అంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు మద్దతిస్తూ ఉండగా, చిన్న నిర్మాతలు అంతా మన ప్యానెల్ కు మద్దతు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఫిల్మ్ ఛాంబర్‌లో భాగమైన ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం 3,355 సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారు. అధ్యక్షుడు మరియు కార్యదర్శితో పాటు 32మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. ఇక ప్రతి రెండేళ్లకు ఓసారి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలైలోనే ప్రస్తుత ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గ పదవీకాలం ముగిసినా కొన్నికారణాల వల్ల ఎన్నికలు ఆలస్యం అయ్యాయి.
Read More..
నేడు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. మన ప్యానెల్ VS ప్రోగ్రెసివ్ ప్యానెల్






