హారర్ మూవీతో వస్తున్న మాస్ మహారాజ్.. డైరెక్టర్ ఎవరంటే ?

by velandi.Saikiran |   (  Updated:2026-01-21 05:40:43  IST  )

సంక్రాంతి బరిలో మంచి హిట్ అందుకున్న రవితేజ ఇప్పుడు హారర్ మూవీతో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హారర్ మూవీతో వస్తున్న మాస్ మహారాజ్.. డైరెక్టర్ ఎవరంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. చాలా రోజులుగా హిట్ లేక చాలా ఇబ్బంది పడిన రవితేజ.. మొన్న సంక్రాంతి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఇప్పటికి కూడా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఈ మూవీలో పాటలు, కామెడీ, రవితేజ యాక్షన్ చాలా ప్లస్ అయ్యాయట. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

హారర్ మూవీతో రాబోతున్న రవితేజ

సంక్రాంతి బరిలో మంచి హిట్ అందుకున్న రవితేజ ఇప్పుడు హారర్ మూవీతో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. రవితేజ కోసం హారర్ కథను సిద్ధం చేశాడట దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. అటు ఇటీవలనే నానితో సరిపోదా శనివారం సినిమా చేసి బంపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. అంతకుముందు బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి లాంటి సినిమాలు కూడా చేశాడు.

Read More..

Tollywood: పదిరోజులు, ఐదు సినిమాలు.. వందలకోట్ల కలెక్షన్లు!

Next Story