రెండో సారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. నా జీవితంలో ఈ దశ అత్యంత అందమైన అధ్యాయం అంటూ ఎమోషనల్ పోస్ట్

by I. Sairam |

సీరియల్స్‌కు తెలుగు వాళ్లకు మధ్య చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది.

రెండో సారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. నా జీవితంలో ఈ దశ అత్యంత అందమైన అధ్యాయం అంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: సీరియల్స్‌కు తెలుగు వాళ్లకు మధ్య చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. ముఖ్యంగా తెలుగింటి ఆడపడుచులకు సీరియల్స్‌కు మధ్య విడదీయ రాని బంధం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 వరకు వచ్చే అన్ని ధారావాహికలను కవర్ చేస్తారు. ఆ టైంలో ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా డోంట్ కేర్ అనేలా ఉంటారు. అయితే ఆ సీరియల్స్‌లో హీరోయిన్స్‌ నటించే వాళ్లకు కూడా మన ఆడియన్స్ అంతే అభిమానిస్తారు. అలా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్‌లో చైత్ర రాయ్ ఒకరు. ‘అష్టా చమ్మా’ సీరియల్ ద్వారా ఈ చిన్నది బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించిన చైత్ర.. పెళ్లి తర్వాత సీరియల్స్ మానేసింది.

తాజాగా ఇప్పుడు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకు ముందే ఓ పాపకు జన్మనిచ్చిన ఈ చిన్నది మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో తనకు సీమంతం అయిన ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘నా జీవితంలో ఈ దశ ఎల్లప్పుడూ అత్యంత అందమైన అధ్యాయంగా మిగిలిపోతుంది.. నాలో ఒక చిన్న ఆత్మను మోసుకెళ్లడం, ప్రతి చిన్న కదలికను, ప్రతి తన్ను, ప్రతి మాయా క్షణాన్ని అనుభూతి చెందడం చాలా సంతోషంగా ఉంది. మాతృత్వం పుట్టుకతోనే ప్రారంభం కాదు, మీరు ఎప్పుడూ కలవని వ్యక్తిని మీ హృదయం ప్రేమించడం ప్రారంభించిన రోజు నుండి ఇది ప్రారంభమవుతుంది.

ఆశీర్వాదాలు, సంప్రదాయాలు మరియు చాలా ప్రేమతో చుట్టబడి ఉంది... నేను బేబీ షవర్‌ను మాత్రమే కాకుండా, మళ్ళీ తల్లి అయ్యే ప్రయాణాన్ని జరుపుకున్నాను. ప్రార్థనలు, ఆశలు, బలం మరియు కృతజ్ఞతతో నిండిన ప్రయాణం. నా చిన్నారికి.. నువ్వు ఇప్పటికే నా ప్రపంచాన్ని నీకు తెలియని విధంగా మార్చావు. నిన్ను పట్టుకోవడానికి, నిన్ను రక్షించడానికి మరియు నా దగ్గర ఉన్న ప్రతిదానితో నిన్ను ప్రేమించడానికి నేను వేచి ఉండలేను’ అంటూ ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story