- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోసపోయిన నటి అంజలి.. ఆన్‌లైన్ లో ఆర్డర్ పెట్టేటప్పుడు జాగ్రత్త!
రూ.2000 విలువైన వస్తువును బుక్ చేసుకుంటే, 200 రూపాయల చీర వచ్చినట్లు నటి అంజలి ఎమోషనల్ వీడియో పంచుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో చాలా మంది ఆన్లైన్ లో అన్ని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. చిన్నపిల్లల వస్తువుల నుంచి ఇంట్లో పెద్దవాళ్లు వాడే వస్తువుల వరకు అన్నిటిని ఆన్లైన్ లో కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్ లో మంచి ఆఫర్లు రావడంతో ఎలక్ట్రిక్ వస్తువులు కూడా కొనేస్తున్నారు. అయితే, ఇలా ఆన్లైన్ ఆర్డర్ చేసే క్రమంలో కొత్త స్కాంలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా బుల్లితెర నటి అంజలికి ఇలాంటి పరిణామం ఎదురైంది. ఆమె బుక్ చేసిన ఐటెం కాకుండా మరో వస్తువును పంపించారట.
దాదాపు రూ.2000 విలువైన వస్తువును బుక్ చేసుకుంటే, 200 రూపాయల చీర వచ్చినట్లు నటి అంజలి ఎమోషనల్ వీడియో పంచుకున్నారు. అమెజాన్ పేరుతో డెలివరీ బాయ్ ఈ వస్తువుని ఇచ్చి వెళ్ళాడట. రెగ్యులర్ గా వస్తువులు బుక్ చేసుకునే వాళ్లను టార్గెట్ చేసి, కొత్త తరహా స్కామ్ లకు పాల్పడుతున్నారట. చీప్ వస్తువులను పెట్టి ఎక్కువ ధర ఉన్నట్లుగా డెలివరీ చేసి మోసాలకు పాల్పడుతున్నారట. అయితే ఈ మోసాలు ఎక్కువగా క్యాష్ ఆన్ డెలివరీ చేసేవారికి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లను టార్గెట్ చేసి ఈ కొత్త తరహా స్కాంలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి స్కామ్స్ పట్ల ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని బుల్లితెర నటి అంజలి పేర్కొన్నారు. క్లిక్






