- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లైన ఆరేళ్లకు గుడ్ న్యూస్ ప్రకటించిన బుల్లితెర యాక్టర్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్ల(పోస్ట్)
స్టార్ మా(Star MAA)లో ప్రసారమయ్యే ‘కోయిలమ్మ’(Koilamma) సీరియల్ యాక్టర్ లహరి సంజు కశ్యప్(Lahari Sanju Kashyap) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ మా(Star MAA)లో ప్రసారమయ్యే ‘కోయిలమ్మ’(Koilamma) సీరియల్ యాక్టర్ లహరి సంజు కశ్యప్(Lahari Sanju Kashyap) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్‌లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం అడపాదడపా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. అలాగే పలు టీవీ షోలతో అలరిస్తూ ఉంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2019లో రాఘవేందర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి తన భర్తతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ చిన్నది ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ తెలిపింది. ఇన్‌స్టాలో తన భర్త అండ్ ఆమె చిన్న బేబీ షర్ట్ పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘మన చిన్న ఆనందపు మూట త్వరలో రాబోతోంది.. నాలో సగం, నా ప్రేమలో సగం అయిన ఈ చిన్న వ్యక్తిని కలవడం చాలా సంతోషంగా ఉంది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా ఈ చిన్నది పెళ్లైన ఆరేళ్లకు తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. Link






