- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది మంచి సందేశాత్మక చిత్రంగా అనిపిస్తోంది.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కామెంట్స్
‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్‌చంద్ర దర్శకత్వంలో రాబోతున్న మరో ఎంటర్‌టైనింగ్ మూవీ ‘పిఠాపురంలో’.

దిశ, సినిమా: ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్‌చంద్ర దర్శకత్వంలో రాబోతున్న మరో ఎంటర్‌టైనింగ్ మూవీ ‘పిఠాపురంలో’. ‘అలా మొదలైంది’ అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ చిత్రంలో డా. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, సన్నీ అఖిల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్‌చంద్ర సినిమా టీమ్ పతాకంపై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్‌ఎం మురళి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది మంచి సందేశాత్మక చిత్రంగా అనిపిస్తోంది. యువతరం కుటుంబ సమేతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.. ఎలా ఎదగాలనే సందేశం ఈ సినిమాలో ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి’ అని చెప్పారు.
డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఇవాళ సమాజంలో ఏం జరుగుతుందనే పాయింట్‌ని దర్శకుడు మహేష్‌చంద్ర అద్భుతంగా డీల్ చేశాడు. స్టోరీ నచ్చి నేను కూడా ఇష్టంగా ఈ సినిమా చేశాను. ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘ఓనమాలు’ తరహాలోనే సందేశాన్ని అందిస్తూనే యువతరాన్ని ఆకట్టుకునే అంశాలున్న సినిమా ఇది’ అని తెలిపారు. దర్శకుడు మహేష్‌చంద్ర మాట్లాడుతూ.. ‘నా తొలి సినిమా ‘ప్రేయసి రావే’ నాకెంతో గొప్ప పేరు తీసుకొచ్చింది. ఈరోజుకీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయి ఉంది. ‘పిఠాపురంలో’ కూడా అదే స్థాయిలో నిలిచిపోయే సినిమా. నా మనసుకి నచ్చిన కథ ఇది. ముగ్గురు తండ్రుల కథలా అనిపిస్తూనే మూడు జంటల మధ్య నడిచే కథ ఇది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ గారి నియోజకవర్గమైన ‘పిఠాపురం’ పేరుతోనే ఈ సినిమా తీశాం. ఈ టైటిల్‌ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారు ఆవిష్కరించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. వచ్చే నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని చెప్పుకొచ్చాడు.






