- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tejaswi Rao: ప్రస్తుతం నా చేతిలో అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి
తాజాగా తేజస్వి రావు మాట్లాడుతూ... ప్రస్తుతం నేను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిపింది. అలాగే కిరణ్ అబ్బవరంతో పాటు, తిరువీర్‌తో కలిసి ఓ సినిమాలో కూడా నటిస్తున్నట్లు చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్: చిన్న సినిమాగా విడుదలై, గత సంవత్సరం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఒకటి. ఇందులో తేజస్వి రావు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అందంతో పాటు నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
దీంతో ఈమె ప్రస్తుతం ఏ చిత్రాల్లో నటిస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో బాగా నెలకొంది. తాజాగా ఈమె తాను నటిస్తున్న చిత్రాల గురించి వెల్లడించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిపింది. అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న ఓ మూవీతో పాటు, తిరువీర్‌తో కలిసి మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు చెప్పింది. ఇలా మొత్తం మూడు ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నట్లు ఈ బ్యూటీ వెల్లడించింది.






