తేజ సజ్జా ‘మిరాయ్’ టీజర్ రిలీజ్.. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-31 08:46:41  IST  )

టాలీవుడ్ సూపర్ హీరో తేజ సజ్జా(Tja Sajja) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “మిరాయ్”(Mirai).

తేజ సజ్జా ‘మిరాయ్’ టీజర్ రిలీజ్.. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ హీరో తేజ సజ్జా(Tja Sajja) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “మిరాయ్”(Mirai). దీనికి యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా.. సూపర్ యోధా‌గా తేజ ఈ సినిమాలో కనిపిస్తాడు. రితీకా నాయ‌క్(Rithika Nayak) క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మంచు మ‌నోజ్(Manchu Manoj) విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, స్పెష‌ల్ గ్లింప్స్‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. తాజాగా ఈ మూవీ టీజ‌ర్‌(Teaser)ను విడుద‌ల చేసింది చిత్ర బృందం.

ఇక టీజర్‌ను గమనించినట్లయితే.. జ‌ర‌బోయేది మార‌ణ‌హోమం.. శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం.. క‌లియుగంలో పుట్టిన ఏ శ‌క్తి దీన్ని ఆప‌లేదు అని జ‌య‌రాం చెప్పిన డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. మంచు మ‌నోజ్ ఇర‌గ‌దీశాడు. తేజ స‌జ్జా యాక్టింగ్ అదిరిపోయింది. మొత్తంగా టీజ‌ర్ చూస్తుంటే గూస్ బంప్స్ వ‌స్తున్నాయి. అలా ఈ టీజర్ మాత్రం ఊహించని రీతిలో ఉందని చెప్పాలి.

ఒక్క మాటలో చెప్పాలంటే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నారని చెప్పవచ్చు. స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఒక హాలీవుడ్ సినిమాలానే మిరాయ్ కనిపిస్తుంది. మంచు మనోజ్ పై సాహస సన్నివేశాల్లో కానీ తేజ సజ్జాపై సన్నివేశాల్లో కానీ ఎక్కడా కూడా మేకర్స్ అసలు కాంప్రమైజ్ అయినట్టే కనిపించడం లేదు. అలాగే ఇండియన్ సినిమాకు ఒక సరికొత్త అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాగా ఇది అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Next Story