తేజా సజ్జా ‘మిరాయ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ ఫిక్స్.. రొమాంటిక్ మూడ్‌లో హీరో హీరోయిన్

by I. Sairam |

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా(Teja Sajja) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’(Mirai).

తేజా సజ్జా ‘మిరాయ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ ఫిక్స్.. రొమాంటిక్ మూడ్‌లో హీరో హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా(Teja Sajja) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’(Mirai). కార్తిక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్(Rithika Nayak) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్(Manchu Manoj) విలన్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Viswaprasad) నిర్మిస్తున్నారు. కాగా గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

అయితే ఈ మూవీ నుంచి రీసెంట్‌గా వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘వైబ్ ఉంది’ అనే ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ సాంగ్ జూలై 26న విడుదల చేస్తున్నట్టుగా లీడ్ జంటపై మంచి పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. అంతేకాకుండా పాన్ ఇండియా భాషల్లో ఈ సాంగ్‌ని ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఇక పోస్టర్‌లో తేజా సజ్జా, రితికా మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారు. వారిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందని పోస్టర్‌ను చూస్తే అర్థమైతుంది.

Link

Next Story