Teja sajja: పదే పదే అలాంటి సినిమాలు చేస్తే ఎందుకు ప్రశ్నించరు.. మీడియాపై తేజా సజ్జా ఫైర్

by Chukka Sudharani |

యంగ్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ‘మిరాయ్’.

Teja sajja: పదే పదే అలాంటి సినిమాలు చేస్తే ఎందుకు ప్రశ్నించరు.. మీడియాపై తేజా సజ్జా ఫైర్
X

దిశ, సినిమా: యంగ్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ‘మిరాయ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తు ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతున్నది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ అకట్టుకోగా.. తాజాగా వచ్చిన ట్రైలర్‌తో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. దీంతో.. ప్రేక్షకులు మిరాయ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుండగా.. ఇటు చిత్ర బృందం ప్రమోషన్స్‌తో మరింత హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న తేజా సజ్జాకు ‘ప్రతి సినిమాలో రిలీజియన్ గురించే ఎందుకు సినిమాలు చేస్తున్నారు’ అనే ప్రశ్న ఎదురైంది.

దీనిపై తేజా స్పందిస్తూ.. ‘పదే పదే లవ్ స్టోరీలు చేస్తే ఎందుకు ప్రశ్నించరు.. మేము మన ధర్మం గురించే చూపించే ప్రయత్నం చేస్తున్నాము. నిజంగా అందుకు గర్వించాలి. ఇది మన భూమి. ఇవి మన మోరల్స్. మీరు 3 నిమిషాల ట్రైలర్‌లో రాముడిని చూసి ఇది మతం గురించి తీసిన సినిమా అని ఫిక్స్ అవుతున్నారు. ఈ మూవీలో ఫ్యాంటసీ ఉంది. యాక్షన్ ఉంది. అడ్వెంచర్ ఉంది. హనుమాన్ చిత్రం కూడా అంతే. అందులో వేరే ఎమోషన్ ఉంటుంది. ఇతిహాసంలోని నీతిని ఇప్పటి జనరేషన్‌కు తెలిసేలా ఏదో ఒక విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. దీనికి అందరూ సంతోషించాలి. అంతే కానీ ఇందులో ఎలాంటి మతాలు లేవు’ అని తెలిపాడు.

Next Story