Sri Chidambaram: శ్రీ చిదంబరం టీజర్ ఎలా ఉందంటే?

by Chukka Sudharani |

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీ చిదంబరం’.

Sri Chidambaram: శ్రీ చిదంబరం టీజర్ ఎలా ఉందంటే?
X

దిశ, సినిమా: వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీ చిదంబరం’. వినయ్ రత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి.. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ‘శ్రీ చిదంబరం’ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో సత్యదేవ్, దర్శకులు వశిష్ట, వెంకటేష్ మహా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

టీజర్ విషయానికి వస్తే.. ఓ అందమైన ప్రేమ కథా, వింటేజ్ విలేజ్ డ్రామాను ఎంతో అందంగా చూపించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో హీరోకి ఉన్న అసలు పేరు కాకుండా.. ఊరంతా కూడా చిదంబరం అని పిలుస్తుంటారు.. మరి అలా ఎందుకు పిలుస్తారు? అసలు హీరో ఎప్పుడూ కూడా కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుని ఉంటాడు? అలా చేయడానికి గల కారణం ఏంటి? అనే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా, సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా టీజర్‌ను కట్ చేశారు మేకర్స్. ప్రజెంట్ ఈ టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది.

Next Story