Oo.. Cheliya: హారర్, లవ్, యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ‘ఓ.. చెలియా’.. టీజర్ ఎలా ఉందంటే?

by Chukka Sudharani |

ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’.

Oo.. Cheliya: హారర్, లవ్, యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ‘ఓ.. చెలియా’.. టీజర్ ఎలా ఉందంటే?
X

దిశ, సినిమా: ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ సినిమా ప్రియుల్లో మంచి రీచ్‌ను సొంతం చేసుకున్నాయి.

అలాగే.. రీసెంట్‌గా మంచు మనోజ్ చేతుల మీద ‘ఓ.. చెలియా’ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయగా.. తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఓ.. చెలియా’ టీజర్‌ను విడుదల చేయించారు చిత్ర బృందం. ఇక టీజర్ విషయానికి వస్తే.. హారర్, లవ్, యాక్షన్ జానర్లను మిక్స్ చేసినట్టుగా కనిపిస్తోంది. భయపెట్టించే అంశాలు చాలానే ఉండగా.. ఈ హారర్ కాన్సెప్ట్‌లో చేసిన ఈ ప్రేమ కథ ఏంటి? మధ్యలోకి ఈ దెయ్యాల కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఉత్కంఠభరితంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.

Next Story