Teaser : ఇది ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ'.. ఆసక్తికరంగా టీజర్

by Chukka Sudharani |

యంగ్ హీరో నరేష్ అగస్త్య (Naresh Agastya) అప్ కమింగ్ మూవీ ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’.

Teaser : ఇది ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ.. ఆసక్తికరంగా టీజర్
X

దిశ, సినిమా: యంగ్ హీరో నరేష్ అగస్త్య (Naresh Agastya) అప్ కమింగ్ మూవీ ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. సునేత్ర ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఉమా దేవి కోట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విపిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కంటెంట్-రిచ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైనా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు పాజిటివ్ బజ్ క్రియేట్ కాగా.. తాజాగా టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ఈ కథ ఒక ప్రతిభావంతమైన సంగీతకారుడి చుట్టూ తిరుగుతుంది. అతడు ఒక గొప్ప ఆల్బమ్‌కి స్ఫూర్తి పొందేందుకు ప్రశాంతమైన పర్వతప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయిని కలుస్తాడు. ఈ ఇద్దరి జర్నీ హృదయానికి హత్తుకునే బంధాన్ని తెరపై ఆవిష్కరిస్తాయి. ఇక టీజర్ చివర్లో హీరో లేచిపోయిన జంటని చూశావా అని హీరోయిన్‌ని సరదాగా అడిగే సన్నివేశం ప్రేక్షకులను క్యూట్‌గా ఆకట్టుకుంటుంది.

Next Story