- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Mahavatar: Narasimha: ఆకట్టుకుంటోన్న ‘మహావతార్: నరసింహ’ టీజర్..

దిశ, సినిమా: ప్రముఖ నిర్మాత సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films)లో రాబోతున్న మరో ఫెంటాస్టిక్ (Fantastic) మూవీ ‘మహావతార్: నరసింహ’ (Mahavatar: Narasimha). డైరెక్టర్ అశ్విన్ కుమార్ (Ashwin Kumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి సంక్రాంతి స్పెషల్‌గా టీజర్ (Teaser)ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు ‘విశ్వాసం సవాలు చేయబడినప్పుడు అతను కనిపిస్తాడు. చీకటి అండ్ గందరగోళంతో నలిగిపోతున్న ప్రపంచంలో నరసింహడు మహావతారంలో వస్తాడు.. 3D యానిమేషన్‌లో మంచి, చెడుల మధ్య పురాణ యుద్ధాన్ని అనుభవించండి’ అంటూ రిలీజ్ చేశారు.
‘నీ పుత్రుని వీరమరణం గురించి నువ్వు శోకించకు మాత.. విష్ణువు నీ సామర్థ్యాన్ని ఇలా సవాలు చేస్తున్నాడు.. నువ్వు నీ పుత్రుడిని వదించాలి అనుకుంటే.. వాడు తన భక్తుడుని కాపాడాలి అనుకుంటున్నాడు’ అనే డైలాగ్‌తో సాగిన ఈ టీజర్‌లో ఓ భక్తుడు (చిన్న పిల్లోడు) నరసింహ స్వామి స్మరిస్తూ ఉండగా.. ఆ బాలుడుని కొందరు చంపేందుకు చూస్తారు. ఇక లాస్ట్‌లో నరసింహ స్వామి మహావతార్‌లో వచ్చినట్టు చూపించి విజువల్స్ (Visuals) వండర్‌గా ఆకట్టుకుంటున్నాయి. ప్రజెంట్ ‘మహావతార్: నరసింహ’ టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. త్రీడీలో రూపొంతున్న ఈ చిత్రం ఏప్రిల్ 3, 2025న తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.