Kannappa Teaser: కన్నప్ప నుంచి టీజర్ వచ్చేసింది.. ప్రభాస్ లుక్ అదిరిందిగా.. !

by Phanindra |   (  Updated:2025-08-02 15:36:30  IST  )

విజువల్ వండర్ గా ఈ మూవీ రికార్డు క్రియోట్ చేయడం పక్కా

Kannappa Teaser: కన్నప్ప నుంచి టీజర్ వచ్చేసింది.. ప్రభాస్ లుక్ అదిరిందిగా.. !
X

దిశ, వెబ్ డెస్క్ : మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ 'కన్నప్ప' (Kannappa Movie). ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్లను ఇప్పటికే మొదలు పెట్టారు. తాజాగా, ఈ మూవీ నుంచి టీజర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ కు పెద్ద ట్రీట్ ఇచ్చారు.

ఈ చిత్రంలో హీరో మంచు విష్ణుతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ బాబు, హీరోయిన్ కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల లాంటి నటీ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ , టీజర్ 1 కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాలో ఎవరెవరు ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారో కూడా అధికారంగా మేకర్స్ తెలిపారు. ఫస్ట్ గ్లిమ్స్, హీరోల ఫస్ట్ లుక్ వంటి ప్రమోషనల్ కంటెంట్ చిత్రంపై అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలోనే 'కన్నప్ప' మూవీ నుంచి టీజర్ ని మార్చ్ 1 న విడుదల చేస్తామని ప్రెస్ మీట్లో చెప్పారు. చెప్పినట్టుగానే ఈ రోజు టీజర్ ను రిలీజ్ చేశారు.

విజువల్ వండర్ గా ఈ మూవీ రికార్డు క్రియోట్ చేయడం పక్కా. విజువల్స్, స్టోరీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 'కన్నప్ప' మూవీతో సినీ లవర్స్ కు విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు అనిపిస్తోంది. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో డైలాగులు, కళ్ళు చెదిరే యాక్షన్స్ కూడా అదిరిపోయాయి. ఇక మంచు విష్ణుకి కన్నప్ప మూవీ ప్రాణంలాగా అయిపోయింది. 2025 ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. విష్ణు చివరిలో 'శివయ్యా' అంటూ పిలిచిన తర్వాత అక్షయ్ కుమార్ ( Akshay Kumar ) కనిపిస్తాడు.1.15 నిమిషం దగ్గర ప్రభాస్ ( Prabhas ) కనిపించాడు . ఈ లుక్ లో డార్లింగ్ అదిరిపోయాడు. టీజర్ చూసిన ఫ్యాన్స్ సినిమా పక్కా హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Click For Video....

Next Story