ఓజీ టికెట్ రూ. 5 లక్షలు.. వేలంలో సొంతం

by Malleboina Mahesh |

టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

ఓజీ టికెట్ రూ. 5 లక్షలు.. వేలంలో సొంతం
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ఓజీ సినిమా (OG movie)పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి బయటకు వస్తున్న గ్లింప్స్, సాంగ్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుండటంతో రోజు రోజుకు హైప్ పెరిగిపోతుంది. ఈ క్రమంలో మరో వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్ హీరోగా సెప్టెంబర్ చివర్లో విడుదల కానున్న ఓజీ సినిమా మొట్టమొదటి నైజాం టికెట్‌ (OG movie is the first Nizam ticket)ను "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందం రూ. 5 లక్షలకు సొంతం చేసుకున్నారు. "నా సేన కోసం నా వంతు సభ్యులు" సందీప్ ధనపాల, అరవింద్ పీసపాటి నైజాం టికెట్ వేలం (Nizam's ticket auction) వేయగా "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా"కు చెందిన సభ్యులు రూ. 5 లక్షలకు దక్కించుకున్నారు.

వేలంలో వచ్చిన రూ. 5 లక్షలు సందీప్ ధనపాల, అరవింద్ పీసపాటి డిడి రూపంలో ఎమ్మెల్సీ నాగబాబు (MLC Nagababu) చేతుల మీదుగా గురువారం జనసేన పార్టీకి అందజేశారు. ఈ సందర్భంగా "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందాన్ని,"నా సేన కోసం నా వంతు సభ్యులు" సందీప్ ధనపాల, అరవింద్ పీసపాటిలను నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా వివిధ హోదాల్లో పని చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ బలోపేతం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి పార్టీకి సహకారం అందిస్తున్న విధానం చాలా మందికి స్ఫూర్తిదాయకమని నాగబాబు ఈ సందర్భంగా వారిని మెచ్చుకున్నారు. ఏది ఎమైనప్పటికి ఓజీ సినిమాపై ఇలాంటి ఘటనలు రోజు రోజుకు మరింత హైప్‌ను పెంచుతున్నాయి.

Next Story