- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yash: యశ్ టాక్సిక్ పోస్ట్ పోన్.. ఫైనల్లీ క్లారిటీ ఇచ్చిన టీమ్
హీరో యశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’. గత కొద్ది రోజులుగా ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దిశ, సినిమా: హీరో యశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’. గత కొద్ది రోజులుగా ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని అనివార్య కారణాల చేత టాక్సిక్ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని ఇక ఇప్పుడప్పుడే రిలీజ్ కాలేదని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
‘పుకార్లను ఆపండి... యశ్ తదుపరి చిత్రం 'టాక్సిక్' విడుదల ఆలస్యం కాదు.. అలాగే వాయిదా వేయలేదు. ముందుగా అనుకున్నట్లు గానే ఉగాది, ఈద్ పండుగలు సందర్భంగా ఈ చిత్రం 19 మార్చి 2026న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్నది. యష్ ముంబైలో రామాయణం చిత్రీకరణ చేస్తున్నప్పుడు పోస్ట్-ప్రొడక్షన్ ప్రారంభమైంది. ఇప్పుడు షూటింగ్ ఫైనల్ దశకు చేరుకుంది.. వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తి స్థాయి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాము’ అని తెలిపారు. కాగా.. జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్’ మూవీని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యశ్, వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంగ్లీష్ అండ్ కన్నడలో ఒకేసారి చిత్రీకరించబడిన టాక్సిక్ చిత్రం.. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లింక్






