జూనియ‌ర్ ఎన్టీఆర్ పై శ్రీ భ‌ర‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

by velandi.Saikiran |

జూనియర్ ఎన్టీఆర్ పై కూటమికి చెందిన పార్లమెంటు సభ్యులు భరత్ ( Bharat Mathukumilli ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ పై శ్రీ భ‌ర‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్నంత ఫాలోయింగ్ మరెఎవరికి లేదన్న సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని, ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. డాన్స్, డైలాగ్స్, అబ్బో చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలే. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానించేవారు ఎక్కువే. వైసీపీ పార్టీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ జపం చేస్తూ ఉంటారు. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ పార్టీ ఎంపీ శ్రీ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ పై ఎంపీ భరత్ హాట్ కామెంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ పై కూటమికి చెందిన పార్లమెంటు సభ్యులు భరత్ ( Bharat Mathukumilli ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ హీరో అని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు నేనెప్పుడూ చూడలేదని వివరించారు. డాన్స్, అతని నటన అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు శ్రీ భరత్. అతని స్పీచ్ లు కూడా అద్భుతంగా ఉంటాయని ప్రశంసించారు. ఎన్టీఆర్‌ స్పీచ్ విని నేను కూడా కాస్త నేర్చుకున్నానని వివరించారు. అలాంటోడికి అందరూ కచ్చితంగా ఫ్యాన్స్ ఉంటారని గుర్తు చేశారు.




Next Story