- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోనే అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమా తరవాత తరుణ్ తీసిన ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ రెండు సినిమాలు టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఈ సినిమా తరవాత తరుణ్ భాస్కర్ దర్శకుడిగానే కాకుండా నటుడిగా సైతం రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే తరుణ్ భాస్కర్ గురించి గత కొద్దిరోజులుగా కొన్ని వార్తలు వైరల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తరుణ్ ఓ టాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఆమెతోనే కలిసి ఉంటున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఓ ఈవెంట్ లో తరుణ్ తన ప్రేమాయణంపై ఓపెన్ అయ్యాడు. మీ ఫ్రెండ్స్ లో లేదా సెలబ్రెటీలలో అయినా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవరిది అని యాంకర్ ప్రశ్నించింది. దానికి తనదే గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అంటూ తరుణ్ భాస్కర్ సమాధానం ఇచ్చాడు. దీంతో తను లవ్ లో ఉన్నట్టు తరుణ్ కూడా ఒప్పుకున్నాడు. మరోవైపు యాంకర్ .. పేరు నాకు తెలుసు కానీ బయటకు చెప్పను అంటూ నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట వైరల్ అవుతోంది.






